Bahuroopulavaadu|బహురూపులవాడు
- Author:
- Pages: 386
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹450.00
బహురూపులవాడు- ట్రాయ్ ని తొలిచి బంగారం తీసిన హైన్రిశ్ ష్లీమన్ విచిత్రజీవితగాథ
Kalluri Bhaskaram కల్లూరి భాస్కరం
పెళ్ళిచూపుల్లో అతనడిగాడు...
“రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?"
తేదీతో సహా ఆమె ఠకీమని చెప్పింది.
"హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?"
ఆమె అప్పజెప్పింది.
పెళ్ళయ్యాక హానీమూన్ కు వెళ్ళారు. అందులో పురావస్తుప్రదర్శనశాలల సందర్శన తప్పనిసరి. వాటిలోని కళాకృతుల గురించి అతను పెద్దగొంతుతో ఉపన్యసించేవాడు. వినివిని విసుగొచ్చి ఆమె చెవులు మూసుకునేది. ఆ నడివయసు మనిషినీ, అతని పడుచుభార్యనూ జనం వింతగా చూసేవారు.
హోటల్ గదికి వెళ్ళాక హోమర్ నుంచి రెండువందల పంక్తులు అప్పజెప్పమని అతను అడిగేవాడు. ఆమె అప్పజెబుతూనే నిద్రలోకి జారిపోయేది.
అతను జీవితాంతం హోమర్ ను ఆరాధించాడు...
ఇలియడ్, ఒడిసీలను పారాయణ చేశాడు...
ట్రాయ్ నిజమని నమ్మాడు...
అతను పచారీ కొట్టులో బస్తాలు మోశాడు. పట్టుదలతో అనేక భాషలు నేర్చాడు.
అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు... ఆర్కియాలజిస్టుగా అవతారమెత్తి పలుగూ, పారా పుచ్చుకున్నాడు. ట్రాయ్ ని తవ్వి బంగారంలాంటి చరిత్రను బయటపెట్టాడు.
భిన్నవృత్తులు, ప్రవృత్తులు, మంచి-చెడుల
చిత్రమైన కలబోత అతని జీవితం...
బహురూపుల ఆ మనిషే... హైన్రిశ్ ష్లీమన్!
Tags: Bahuroopulavaadu, బహురూపులవాడు, Kalluri Bhaskaram కల్లూరి భాస్కరం, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్