Cheruva|చేరువ - వి. రాజా రామమోహనరావు కథలు-2

Cheruva|చేరువ - వి. రాజా రామమోహనరావు కథలు-2

  • ₹275.00

రాజా రామమోహనరావు నా సమవయస్కుడే అయినా, ఆప్త మిత్రుడే అయినా, కథా రచయితగా మాత్రం తను అంటే మాకు అందరికీ ఆ రోజుల్లో గురుభావం ఉండేది. దాదాపు ప్రతి కథని ఒక శిల్పం లాగా చెప్పటం తన విశిష్ట గుణం. ఆషామాషీగా చదివి పక్కన పెట్టేసే కథలు కావు తనవి. అటువంటి రచయిత పాత కథలు ఒక సంపుటిగా వస్తున్న ఈ తరుణంలో శుభాభినందనలు.     -యండమూరి వీరేంద్రనాథ్

******

గుంపులో ఏ ఒక్కరూ మిగలకుండా అంతా వెళ్లిపోయారు. రోడ్డు మీద చూసే అనేక యాక్సిడెంట్సుని చూసినట్టే అదీ చూశారు. ఎవర్నీ ఎవరూ తప్పు పట్టలేని వేగం... చాలా అమానుషాలు, దారుణాలు అతి సాధారణమైపోయిన వేగం...

******

“మొక్కు బాగానే వుంది. నాకు తగ్గటం బాగానే వుంది. కానీ అసలు సంగతి ఆలోచించావా... యీ గుండేసుకునుంటే నీ దగ్గరకెవడొస్తాడే... మళ్లీ తలొచ్చేదాకా నీ యాపారం కొండెక్కినట్టే...”

******

లక్షల మందికి రాత్రి, చీకటి యింత భయంకరంగా వుండి, కొన్ని వందల మందికి మత్తుగా, హాయిగా, మితిమీరిన సుఖంతో గడవటం కూడా చాలామందికి ఆశ్చర్యంగా బాధగా వుండటం లేదు. అదే ఆశ్చర్యం.

******

ఎన్నో ఏళ్లుగా తెలిసీ తెలియకుండా చెలామణి అవుతూ వస్తున్న గుణాన్ని గుర్తుగా చూట్టానికి, వికృత వినోదాలు చూట్టానికి అలవాటుపడ్డ క్రూరమృగాన్ని తమలోనే గుర్తించడానికి భయం వేసింది కృష్ణారావుకి.

******

తనున్న ప్రపంచం, వాళ్లున్న ప్రపంచం వేరువేరుగా తోచాయి రంగమ్మకి. ‘కూలికి బిడ్డని పెంచిన నేను ఎక్కువ ఆశలకి పోయానేమో..?’ అనుకుంది కన్నీళ్లు తుడుచుకుంటూ చివరికి.

******

“మారటం కాదు, మార్చటం. యిలా మనని మార్చటమే మన చుట్టూ వున్న వాతావరణం పద్ధతైనప్పుడు, దాని బలానికి మనం తట్టుకోలేనప్పుడు ఏం చెయ్యటం చెప్పు...”

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Cheruva, చేరువ, వి. రాజా రామమోహనరావు కథలు-2, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056993, V. Raja Ramamohana Rao