Kaadambari | కాదంబరి
- Author:
- Pages: 422
- Year: 1962/2016
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Kavita Publications-కవిత పబ్లికేషన్స్
-
₹200.00
అనువాదం: విద్వాన్ విశ్వం
కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త బాణభట్టుడు దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు. ఈ వచనకావ్య రచన పూర్తిచేయకుండా బాణుడు మరణించడంతో ఆయన కుమారుడు భూషణభట్టుడు పూర్తిచేశాడు. (మరికొందరి కథనం ప్రకారం కొడుకు పేరు పుళిందభట్టు) వీలుకోసం భూషణభట్టుడు రాసిన భాగాన్ని ఉత్తర భాగమనీ, బాణభట్టుడు రచించిన భాగాన్ని పూర్వభాగమనీ పేర్కొంటారు పండితులు. భూషణభట్టుడు కర్తృత్వం వహించి పూర్తిచేసినా తండ్రి బాణభట్టుడు అప్పటికే చేసిపెట్టిన రచనా ప్రణాళికనే అనుసరించాడు. ఇతివృత్తాన్ని గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించిన ప్రఖ్యాతమైన బృహత్కథ నుంచి స్వీకరించారు. 11వ శతాబ్దంలో సోమదేవుడు పైశాచీ భాషనుంచి సంస్కృతీకరించినట్టు చెప్పే బృహత్కథ అనువాదమైన కథా సరిత్సాగరంలో కూడా ఇదే ఇతివృత్తం ఓ కథగా కనిపిస్తుంది.
గుణాఢ్యుని బృహత్కథలోని అనేకమైన కథల్లో ఒకటైన సుమనస్ అనే రాజు కథ నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి విస్తరించి కాదంబరిగా మలిచాడు బాణుడు. ఈ ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు కలిసి ఒకే పాత్ర వేర్వేరు జన్మలతో వేర్వేరు కాలాల్లో తిరిగి కనిపిస్తుంటుంది. కథానాయకి కాదంబరి కథ మధ్యలోకి వచ్చేంతవరకూ కనిపించదు. విదిశ రాజ్యాధిపతియైన శూద్రకుని గాథ ఇది.
Tags: Kaadambari, కాదంబరి, బాణభట్ట, Banabhatta