Manduchupu | మందుచూపు - కథకాని కథలు
- Author:
- Pages: 112
- Year: 2023
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹125.00
సత్కవుల్ హాలికులలైన నేమి,
ఆల్కహాలికులైన నేమి
-శ్రీశ్రీ
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్దీ
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ
-ఆరుద్ర
అలనాటి 'తీయటి' అనుభూతుల జ్ఞాపకాలకు, అక్షర రూపం వర్మగారి ఈ కథగాని కథలు. “మందులెన్ని రకములో మందు మహిమలు అన్ని రకములు”-ఈ రకాల్లోని కొన్ని రకాలు ఈ కథగాని కథల్లో దర్శనమిచ్చినప్పుడు, మధుపాన ప్రియులు తమ తమ జ్ఞాపకాలను నెమరువేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు. బొత్తిగా మందువాసన గిట్టనివాళ్లు ముళ్లపూడి పరిభాషలో “హౌరా!” అనుకోవచ్చు! - కోడూరి శ్రీరామమార్తి
ఎందరు మహానుభావులు ఏం చెప్పినా, సత్కవులు హాలికులుగా, ఆక్షర హాలికులుగానే ఉండాలి -సింగంపల్లి అశోక్ కుమార్
మరణ దండన విధించినప్పటికీ హత్యలు జరిగినట్టు, వ్యభిచార నిషేధచట్టం అమల్లో వున్పప్పటికీ వ్యభివారం యధేచ్ఛగా సాగినట్టు, ఇన్ కమ్ టాక్సు యాక్టు కొనసాగినప్పటికీ పెద్దవారు పన్నులు ఎగవేసినట్టు, గంధపు చట్టం అమల్లో వున్నప్పటికీ వీరప్పన్ అనే ఆసామీ స్వేచ్ఛగా తిరిగినట్టు- నిషేధం వున్నా లేకున్నా కల్లూ సారా తాగేవారు తాగకుండా పోరు... సారాను ఎవరికి వారు నిషేధించుకోవలెను. -రాచకొండ విశ్వనాథ శాస్త్రి
Tags: Manduchupu, KVS Varma, Astra Publishers, మందుచూపు - కథకాని కథలు, కె.వి.యస్. వర్మ, అస్త్ర పబ్లిషర్స్, Manduchoopu