Sanathanam|సనాతనం - A Radical Insight
- Author:
- Pages: 88
- Year: 2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹125.00
సనాతనులలో రాడికల్
రాడికల్స్ లో సనాతనుడు
'లాస్ట్ బ్రాహ్మిణ్ '
రాణి శివశంకరశర్మ
మీ ముందుంచిన
ప్రశ్నోపనిషత్తు...
మనిషి చాలావరకు దారితప్పిపోయాడు. సూర్యునితో ఉషస్సుతో
కొండకోనల్తో గుహముఖాల్తో సంబంధాన్ని కోల్పోయాడు.
యీ ప్రపంచమే పెద్ద అబద్ధం, కల్పన. దానిలో కొన్ని కొత్త కల్పనల్నీ
అబద్ధాల్నీ చేర్చారు రకరకాల ఉద్యమకారులు.
బహుళ అర్థాలని అస్తిత్వాలని ఒకే మూసలోకి ఇమిడ్చి, డైనమిక్ గా వుండే
భారతీయ స్థల కాలజ్ఞానం స్టాటిక్ గా మార్చబడింది.
దానినుంచే హిందుత్వ, అయోధ్య రాజకీయాలు పుట్టాయి.
సావిత్రీదేవి పద్ధతి పాశ్చాత్య భారతీయ తత్వాలని కలిపే ప్రయత్నం.
అదొక భ్రష్టతని సృష్టించింది. అదే హిందుత్వ.
భారత ఖండంలో వేదాంతం అస్తిత్వాన్ని తాకే అమాయకత్వాన్ని కోల్పోయి
మార్కెట్ మాయలో లయమైంది. అందువల్లనే ఉపనిషత్తత్వం
పరిహాసానికి గురైంది. అది మార్కెట్ మాయాజాలంలో యిరుక్కుపోయింది.
యిప్పుడు మనం చేయాల్సింది ప్రశ్నని ప్రశ్నీకరించడం.
Tags: Sanatanam, సనాతనం- A Radical Insight, రాణి శివశంకరశర్మ, జో ప్రచురణలు, Sanatanam