Theneeti Pustakam| తేనీటి పుస్తకం
- Author:
- Pages: 130
- Year: 2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹135.00
ఒకాకురొ కకుజో (1862-1918) జపనీయ పండితుడు, కళావిమర్శకుడు, రచయిత. పందొమ్మిది, ఇరవయ్యవశతాబ్దాల సంధి యుగంలో కకుజో జపాన్సంస్కృతినీ, సౌందర్యారాధననీ తక్కిన ప్రపంచానికి పరిచయం చేసాడు. ఆయన ప్రశస్తరచనల్లో ‘ద బుక్ ఆఫ్ టీ’ ఒకటి.
పట్టుమని వందపేజీలు కూడా లేని ఆ రచన ఒక కావ్యం, ఒక మానిఫెస్టో. సరళసుందరమైన, ఆత్మను పరిశుభ్రం చెయ్యగల జీవనవిధానంలోకి తెరిచిన కిటికీ. అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతుల్లో, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ. అందులో కళ ఉంది, కవిత్వం ఉంది, పూలున్నాయి, సంగీతం ఉంది, అన్నిటికన్నా మించి నువ్వు నీ ఇంట్లోనే ఉంటూ, ఒక కప్పు టీ తాగుతూ, విముక్తమానవుడిగా ఎట్లా జీవించవచ్చో చెప్పే ఆధ్యాత్మిక తత్త్వశాస్త్రమంతా ఉంది.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, అనువాదకుడు, వక్త, చిత్రకారుడు. ఆయన తెలుగు పాఠకులకోసం అందిస్తున్న అనువాదం ఇది.
Tags: తేనీటి పుస్తకం, ఒకాకురొ కకుజో, వాడ్రేవు చినవీరభద్రుడు, అనల్ప బుక్ కంపెనీ, 9789393056269. Theneeti Pustakam, Vadrevu Chinaveerabhadrudu, Analpa Book Company